జమ్మూకశ్మీర్‌ను సందర్శించిన 1.62 కోట్ల మంది టూరిస్టులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌ను ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు జమ్మూకశ్మీర్ టూరిజం శాఖ అధికారి వెల్లడించారు. ఆర్టికల్ 370,35B ని తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరువాత, జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందనడానికి ఇదే నిదర్శన్నారు. 30 సంవత్సరాల తరువాత మళ్లీ అధిక స్థాయిలో లక్షలాది మంది టూరిస్టులు కశ్మీర్‌కు వస్తున్నట్లు ఆయన తెలిపారు.కశ్మీర్ టూరిజంలో మళ్లీ స్వర్ణయుగం మొదలైందని, జమ్మూకశ్మీర్ ప్రాంత ప్రజలకు టూరిజమే అతిపెద్ద ఉపాధి అన్నారు.2022 జనవరి నుంచి ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత్ చరిత్రలో అత్యధిక స్థాయిలో పర్యాటకులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ ఏడాది తొలి 8 నెలల్లోనే రికార్డు స్థాయిలో 20.5 లక్షల దేశీయ టూరిస్టులు వచ్చారని,ఇందులో 3.65 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు. పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్ లాంటి టూరిస్టు ప్రాంతాల్లో హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లు నూటికి నూరు శాతం నిండిపోయాయి అని తెలిపారు. టూరిజం వల్ల పూంచ్, రాజౌరి, జమ్మూ, కశ్మీర్ లోయలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు స్థానికులు పొందారన్నారు.చిత్ర నిర్మాణానికి సంబంధించి, సమగ్రమైన ఫిల్మ్ పాలసీని కూడా రూపొందించమని, ఈ సారి 140 సినిమా షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.