AMARAVATHIEDUCATION JOBS

ఏప్రిల్ 3 నుంచి 18వ వరకు 10వ తరగతి పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేది నుంచి 18వ తేది వరకు 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి..పరీక్షల సమయంలో ఒక నిముషం నిబంధన అమలులో ఉంటుందని,,ఈ నియమాన్ని ఉల్లంఘించిన విద్యార్ధులను ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు..సమయానికి పరీక్షా కేంద్రాలకు  చేరుకోవాలని విద్యార్దులకు సూచించారు..ఉ.930 నుంచి మ.12.45 సమయం మధ్య పరీక్షలు జరగుతాయి..ఉ.9.30 దాటి నిముషం ఆలస్యమైనా పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు..పరీక్ష కేంద్రాలోకి సెల్ ఫోన్లు,,ట్యాబ్స్,, ల్యాప్ట్యాప్‌ల వంటి డిజిటల్ పరికరాలపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు..పరీక్షలకు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 55,000 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరుకానున్నారు..ఈ సంవత్సరం నుంచి ఒకే పేపరు విధానంలో పరీక్ష జరుగుతుంది..అంటే ఒక సబ్జెక్టు రెండు పేపర్లతో కాకుండా, ఒక్క పేపర్‌తోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది..ఈ పరీక్షలకు సంబంధించిన బ్లూ ప్రింట్,,ప్రశ్నా పత్రాలు,,ప్రశ్నలు,,వెయిటేజీ వివరాలను విద్యా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు..

పరీక్షల షెడ్యూల్:- ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్,, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్,, ఏఫ్రిల్ 8న ఇంగ్లిష్,, ఏప్రిల్ 10న మ్యాథమెటిక్స్,, ఏప్రిల్ 13న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ),, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్,,ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్స్,, ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్స్ పరీక్షలు జరుగుతాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *