అమరావతి: పశ్చిమబెంగాల్‌లో స్కూల్స్ సర్వీస్ కమీషన్ స్కామ్‌లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ,,ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీకి కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు జడ్జీ జిబోన్ కుమార్ సాధు,14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు..వాదనల సమయంలో అర్పిత ప్రాణానికి ముప్పుందని ఆమె తరపున వాదిస్తున్న లాయర్ వాదించారు. అర్పితకు ఇచ్చే నీరు, ఆహారాన్ని కూడా చెక్ చేసి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఆమెను మిగతా నిందితులతో కలిపి కాకుండా ప్రత్యేక గదిలో ఉంచాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా దీనికి మద్దతు పలికారు.