నెల్లూరు: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 14,,16 సంవత్సరాల లోపు బాలబాలికలకు నెల్లూరు జిల్లా స్థాయి ఎంపికలు ఈనెల 24వ తేదిన ఉదయం 9 గంటల నుంచి ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి అరిగెల.విజయకుమార్ తెలిపారు..అండర్-14 విభాగంలో ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 15 జనవరి 2009 & 14 జనవరి 2011 మధ్య జన్మించి వుండాలని,, అండర్-16 విభాగంలో ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 15 జనవరి 2007 & 14 జనవరి 2009 మధ్య జన్మించి వుండాలన్నారు..పోటీల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా పుట్టిన తేది దృవీకరణ పత్రం(మునిసిపాల కార్పొరేషన్ లేదా పంచాయితీల ద్వారా పొందిన),,ఆధార్ కార్డు,,పాస్ పోర్టు సైజు ఫోటోతో 24వ తేది హారుజరు కావలన్నారు..జిల్లా స్థాయిలో ఎంపికైన వారు 18వ 18వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్,2023 జనవరి 12వ తేది నుంచి 14వ తేది వరకు బీహర్ రాష్ట్రంలోని పాట్నాలో పాల్గొనే అవకాశం వుంటుందన్నారు.ఇతర వివరాలకు 9441875190,,9701798480లో సంప్రదించాలని సూచించారు.