అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు-మంత్రి అంబటి

నెల్లూరు: జిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలు అవుతున్న పనుల పురోగతిపై మంత్రి అంబటి,జిల్లా మంత్రి కాకాణి,కలెక్టర్ చక్రధర్ బాబులతో కలసి సమీక్షిండంతో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ సంధర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో నెల్లూరు బ్యారేజి,మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి తెలిపారు.ప్రజలు కోరుకున్న అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, అలాగే ప్రతి శాసన సభ్యునికి రెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.శాసన సభ్యులు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం, పరిష్కరించలేని సమస్యలను ఏ కారణం వలన పరిష్కరించలేకపోవడం జరిగిందో తెలియచేయడం జరుగుతుందన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూఆయా రంగాల అభివృద్దికి కృషి చేయడం జరుగుచున్నదన్నారు.పరిపాలన వికేంధ్రీకరణలో భాగంగా కొత్తగా జిల్లాలు ఏర్పడిన తరువాత జనాభాలో అత్యధిక జనాబా కలిగి, రెండు ప్రధాన జలాశయాలు, ప్రధాన ఓడ రేవులతో అత్యంత ప్రాధాన్యత కల్గిన జిల్లాగా ఏర్పడిందన్నారు.