ఉన్మాది కాల్పుల్లో 23 మంది చిన్నారులు మృతి

అమరావతి: థాయ్లాండ్‌లో గురువారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. నార్త్ఈస్ట్రన్ నోంగ్ బువా లమ్ ప్రావిన్సులోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడడంతో, 30 మంది వరకు మరణించారు.న్యూస్ ఏజెన్సీలకు అందుతున్న సమాచారం ప్రకారం వీరిలో 23 మంది చిన్నారులు,2 టీచర్స్ ఉన్నారు. కాల్పులకు పాల్పడింది మాజీ పోలీస్ ఆఫీసర్ అని దర్యాప్తులో తేలింది.సంవత్సరం క్రిందట మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఈ కేసుకు సంబంధించి అతను శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మారణహోమానికి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ ఘటన అనంతరం దుండగుడు తన కుటుంబసభ్యులను హత్య చేయడంతో పాటు తనను తాను కాల్చుకున్నట్లు సమాచారం.ఇప్పటికి వరకు తెలిసిన సమాచారం మేరకు…