హైదరాబద్: GST డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారులమంటూ నగరంలోని వివిధ వర్గాల వ్యాపారల వద్ద దాదాపు రూ.28 కోట్లను నొక్కేసిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ SOT పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని బాలానగర్ DCP సందీప్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి… సిరిసిల్లకు చెందిన నారాయణ గౌడ్(57), వరంగల్ కు చెందిన శైలజ (37) లు చితపరిచితులు. నారాయణ గౌడ్ కు GST శాఖలో జరిగే లావదేవిలపై మంచి పట్టు ఉండడంతో ఉన్నతాధికారిగా చలమణి అవుతున్నాడు. నగరంలో పలు ప్రాంతాల్లో స్టీల్, సిమెంట్, గోల్డ్, లిక్కర్ వ్యాపారాలు చేసే వ్యాపారుల వద్దకు వెళ్లి తాను GSTలో అసిస్టెంట్ కమిషనర్ అధికారినంటూ పరిచయం చేసుకుంటాడు.GST లేకుండానే సామగ్రి కొనుగోలు చేసి అధికంగా మిగుల్చుకోవచ్చని వారిని నమ్మించాడు.మీరు ఓకే అంటే GSTలో డిప్యూటీ కమిషనర్ శైలజ సైతం మీకు సహకరిస్తుందని ఆమెను వారికి పరిచయం చేస్తాడు.అతని మాటలు నమ్మిన సుమారు 18 మంది వ్యాపారస్తులు, దాదాపు రూ.28 కోట్లను వివిధ రూపాల్లో వారికి అందచేశారు.అనంతరం GSTకి సంబంధించిన సమస్యలపై వ్యాపారస్తూలు వీరిని సంప్రదించేందుకు ప్రయత్నిచడంతో,కేటుగాళ్లు స్పందించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు GST శాఖలో వారిపై ఆరా తీయగా నకిలీ అధికారులనే విషయం బయట పడింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద ఓ కారు, రూ 20 వేల నగదు, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా వారిపై 13 కేసులు నమోదైనట్లు తెలిపారు.