AMARAVATHI

దేశంలో 3 కోట్ల మత్స్యకార కుటుంబాలు, 8000 కి.మీ తీర ప్రాంత-కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

అమరావతి: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 20 వేల కోట్ల రూపాయలతో మత్స్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు..శనివారం నగరంలోని వి.ఆర్.సి మైదానంలో సింహపురి సేంద్రియ మేళాను (ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం)  కేంద్ర మంత్రి,మంత్రి సీదిరి అప్పలరాజుతో కలసి ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పురుషోత్తం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత్స్య రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ, అత్యధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 2500 కోట్ల రూపాయలతో  ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేశామని, మరో రెండు ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. కృష్ణపట్నం వద్ద ఫిషింగ్ జెట్టిని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా జలమార్గంలో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టుకు ప్రవేశించినట్లు చెప్పారు. ఈ సాగర్ పరిక్రమ పర్యటన ద్వారా తీర ప్రాంతాల్లో హార్బర్ల స్థితిగతులు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక వసతుల కల్పనపై నిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందన్నారు. మత్స్యకార రంగానికి గత ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంలో కొత్తగా మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, తనను మంత్రిగా నియమించినట్లు చెప్పారు. పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు, 8000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందన్నారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోని 30 శాతం మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందని, ఇది దేశంలోనే అత్యధికమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు,,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

6 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

This website uses cookies.