30 సంవత్సరాల తరువాత-చెన్నై సిటీలో భారీ వర్షం

ఎల్లో ఆలర్ట్..
అమరావతి: ఈశాన్య రుతుపవనాల ఉగ్రరూపం ప్రారంభంమైనట్లు కన్పిస్తొంది..ఇందుకు నిదర్శనం సోమవారం నుంచి చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షమే ఉదాహారణ..రుతుపవనాల ప్రభావం దక్షణకోస్తాంధ్రపై కూడా తీవ్రస్థాయిలో వుండనున్నదా అంటే?? చెన్నైలో గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నుంగంబాక్కంలో ఒక్క రోజులో 8 సెంటీమీటర్లు, చెన్నై శివారు రెడ్ హిల్స్ లో 13 సెంటీమీటర్ల వర్షం, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1990లో చెన్నై సిటీలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది.రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు తలైత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది.చెన్నైతో పాటు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాల కరుసే ఆవకాశం వుందని RMC చెన్నై హెడ్ డా. బాలచంద్రన్ తెలిపారు.భారీ వర్షాల పట్ల ప్రజలను ఆప్రమత్తం చేస్తు,వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.