CRIMEDISTRICTS

సివిల్ సప్లయ్స్ లో 32 మంది ఉద్యోగులు-రూ.40 కోట్లు దుర్వినియోగం-జాయింట్ కలెక్టర్

క్యాన్సిల్ చేసిన చెక్కులను కూడా డ్రా..

నెల్లూరు: జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తుకై నివేదించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన కుంభకోణంలో మొత్తం 40 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లుగాను, 32 మంది ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. గత సెప్టెంబర్ లో కార్యాలయ అంతర్గత తనిఖీ సందర్భంగా ఆదాయపు పన్నుకు సంబంధించి మోసపూరిత చాలాన ద్వారా నిధుల దుర్వినియోగం జరిగినట్టు గుర్తించి, సంబంధిత రికార్డులు అందజేయమని కోరడం జరిగిందన్నారు. రికార్డులు అందజేయడంలో జాప్యం చేయడంతో, అదే సమయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించి విచారణకు ఆదేశించారన్నారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఇప్పటికే 11 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. అప్పటినుండి పూర్తిస్థాయి విచారణలో భాగంగా గత ఐదు సంవత్సరాల లావాదేవీలను పరిశీలన చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 14.91 కోట్ల రూపాయల విలువ గల పోస్ట్ డేటెడ్ చెక్కులను గుర్తించామన్నారు.2016 నుండి పనిచేసిన DMల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. సంస్థ పరిధిలో దాదాపు వివిధ రకాల 30 ఖాతాలు ( హెడ్ ఆఫ్ అకౌంట్స్ ) ఉండగా, అన్ని చెల్లింపులు ఒకే ఖాతా నుండి జరిగినట్లుగా గుర్తించామన్నారు. క్యాన్సిల్ చేయబడిన చెక్కులను కూడా డ్రా చేసినట్లుగా గుర్తించామన్నారు. సంబంధిత వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను స్తంభింప చేయవలసిందిగా జిల్లా రిజిస్టార్ ను కోరడం జరిగిందన్నారు. ఇన్వెస్టిగేటెడ్ ఏజెన్సీల ద్వారా మాత్రమే సమగ్ర దర్యాప్తు జరగగలదని భావించి జిల్లా కలెక్టర్ కు, పౌర సరఫరాల సంస్థ MDకు నివేదించామన్నారు. రాబోవు ఫిబ్రవరి మాసంలో జరిగే ధాన్యం సేకరణలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్బంగా పాత్రికేయుని ప్రశ్నకు సమాధానంగా జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *