అమరావతి: ఆహార పదార్దాల కల్తీల కారణంగా ప్రజల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది.అయితే ప్రజల ఆరోగ్యంతో మాకు పనేంటి,కల్తీ చేసి ఆక్రమంగా డబ్బు సంపాదించడమే ధ్యేయం అంటూ ప్రస్తుత సమాజంలో నీచులు పనిచేస్తున్నారు.ఇందుకు పరకాష్ట… ఇప్పటి వరకు మనం చూసింది…బియ్యం, పప్పు ధాన్యాలు,కారం, పాలు,నూనెలు,నెయ్యి,ఆల్లం,వెల్లులు పేస్ట్, వంటి వాటిని కల్లీ చేస్తూ సొమ్ముచేసుకున్న కల్తీ నీచులు, తాజాగా నకిలీ జీలకర్రను తయారు చేస్తూ పట్టుబడ్డారు..ఢిల్లీలోని కంఝూవ్లాలోని మందన్ పూర్ లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఏదో నకిలీ పదార్దలు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది…సమాచారం అందుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడి చేశారు.అక్కడ 348 బస్తాల జీలకర్ర రవాణా చేసేందుకు సిద్దంగా వున్న లారీ,,55 బస్తాల జీలకర్ర పొట్టు,35 బస్తాల గడ్డి,,25 క్యాన్ల మొలాసిస్,,25 బస్తాల రాతి పొడి దొరికింది..వీటిని ఉపయోగించి నకిలీ జీలకర్రను తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు,అక్కడ దొరికిన పదార్దలను సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.