ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.390 కోట్ల స్థిరాఆస్తులు,బంగారం,నగదు,వజ్రాలు..

అమరావతి: సిబిఐ,,ఐటీ,ఈడీ సంస్థలు దేశవ్యాప్తంగా,ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగొట్టిన వారిపై తన మన భేదం లేకుండా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.ఇలాంటి దాడుల్లో వందల కోట్ల విలువ చేసే,,నొట్ల కట్టలు,, బంగారం,వజ్రాలు, ముత్యాలు,స్థిరాస్తి డాక్యమెంట్స్ బయటపడుతున్నాయి..ఈ నేపధ్యంలోనే సదరు వ్యాపారవేత్త సంస్థలు,,ఫార్మ హౌస్ లో తనఖీలు చేసేందుకు ఐటీ అధికారులు తమ కార్లకు సినిమా యూనిట్ స్టికర్స్ ను అతికించుకుని,ఎవ్వరికి అనుమానం రాకుండా లోపలికి ప్రవేశించారు…. మహారాష్ట్రలోని జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది.. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ దాడులు నిర్వహించింది..ఐటీ అధికారుల తనిఖీల్లో సదరు వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.. ఈ సోదాల్లో రూ.56 కోట్ల నగదు,,32 కిలోల బంగారం,, ముత్యాలు,, వజ్రాలు,,300 కోట్లు విలువ చేసి ప్రాపర్టీ పేపర్లతో సహా దాదాపు రూ.390 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్ చేశారు..పట్టుబడిన నగదును లెక్కించేందుకు అధికారులకు ఏకంగా 16 గంటల సమయం పట్టింది..అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఐటీ అదికారులు విచారణ ప్రారంభించారు..