అమరావతి: బిహార్‌లో ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు,,ఆఫీసులపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడిలో రూ.4 కోట్లకుపైగా నగదు దొరికింది..కిషన్ గంజ్ డివిజన్‌కు చెందిన పబ్లిక్స్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన సంజయ్ కుమార్ రాయ్ అక్రమాలకు పాల్పడ్డాడన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (వీఐబీ) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పాట్నా, కిషన్ గంజ్‌లోని ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు.సంజయ్ కుమార్ లంచంగా వసూలు చేసిన డబ్బును,,అతడి కింది స్థాయి ఉద్యోగుల వద్ద కూడా దాచిపెట్టాడు. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు,, అతడి వద్ద పనిచేసే జూనియర్ ఇంజినీర్, క్యాషియర్ ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం ముగ్గురి నివాసాల్లో ఒకేసారి సోదాలు చేయడంతదో,క్యాషియర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు,,సంజయ్ ఇంట్లో రూ.1కోటికిపైగా నగదు లభించింది.ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు దొరికిన నగదు లెక్కించేందుకు మెషీన్స్ ను రప్పించారు..