AMARAVATHIEDUCATION JOBS

జిల్లాలో 423 ప్రవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 4230 మందికి అవకాశం-కలెక్టర్ వెంకటరమణారెడ్డి

తిరుపతి: ఏపీ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(C) మేరకు పేద విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలల్లో 1 వ తరగతిలో ఉచిత  ప్రవేశానికి అవకాశం కల్పించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన పేద కుంటుంబాల విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో, 2023-24 విద్యా సంవత్సరం 1వ తరగతిలో అడ్మిషన్ కొరకు ఏప్రిల్ 1వ తేదీ నాటికి 5 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన పిల్లల వివరాలతో ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో 423 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 4230 మందికి అవకాశం వుందన్నారు..విద్యా హక్కు చట్టం-2009,AP RTE 2023,  సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 25%  సీట్లు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పేద కుటుంబాలకు కేటాయింపు కొరకు నిబంధనలు పొందుపరచడం జరిగిందన్నారు.. http://cse.ap.gov in/RTE వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు..సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు, దారిద్ర్యరేఖకు దిగువున వున్నవారు, భూమిలేని వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ఎస్.సి, ఎస్టీలు అర్హులని, గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉచిత దరఖాస్తు సదుపాయం కల్పించబడిందని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *