స్విమ్ స్వాప్ టెక్నాలాజీ..
అమరావతి: దేశంలోని జమ్తారాలో మోసగాళ్ళు, OTP కోడ్‌లను కూడా అడగకుండా వారి డబ్బును మోసం చేయడానికి అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఓ కేసులో ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ కంపెనీకి డైరెక్టర్ అయిన షంషేర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్‌కు పలు మిస్డ్ కాల్స్ రావడంతో అతని ఖాతా నుంచి 50 లక్షల రూపాయలు దోచుకున్నారు..గత నెలలో సదరు వ్యక్తికి సెల్ ఫోన్ కు రాత్రి 7 నుంచి 8-45 నిమిషాల మధ్యలో దాదాపు 20 మిస్ట్ కాల్స్ వచ్చాయి.ఇందులో కొన్ని కాల్స్ ను లిప్ట్ చేయగా అవతలి నుంచి ఎవరు మాట్లాడకపోవడంతో,తరువాత వచ్చిన మిస్ట్ కాల్స్ గురించి సింగ్ పట్టించుకోలేదు.కొంత సమయం తరువాత బాధితుడి ఫోన్ కు RTGS ద్వారా నగదు బదలీ అయినట్లు మేసేజ్ రావడంతో,బిత్తరపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.అతని ఖాతా నుంచి రూ.50 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు,దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు ఇలాంటి మోసాలకు పాల్పపడేది ఝార్ఖండ్ జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ మోసగాళ్లుగా అనుమానిస్తున్నారు.స్విమ్ స్వాప్ టెక్నాలజీ ఉపయోగించి నగదును బదలీ చేసినట్లు గుర్తించారు.బ్లాంక్ లేదా మిస్డ్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు RTGSకు చెందిన OTPను యాక్టివేట్ చేసి,IVR కాల్స్ ద్వారా వాటిని వాడుతున్నారు.