NATIONALTECHNOLOGY

భారత్ లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులు

అమరావతి: భారతదేశంలో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం రిజర్వు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్నది..ఈ నిల్వలు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లా,సలాల్ హైమాన్ ప్రాంతంలో ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది..దేశవ్యాప్తంగా కేంద్ర గనులశాఖ మొత్తం 51 క్షేత్రాలను గుర్తించింది..వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.. సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన శోధనల్లో మొత్తం ఐదు క్షేత్రాల్లో బంగారు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు..మిగిలిన ప్రాంతాల్లో పొటాష్,,మాలిబ్డినం,,ఇతర ప్రాథమిక లోహాలు గుర్తించారు..జమ్మూకాశ్మీర్,, ఆంధ్రప్రదేశ్,,చత్తీస్ గఢ్,,గుజరాత్,,జార్ఖండ్,,కర్నాటక,,తమిళనాడు,,ఒరిస్సాలో ఈ నిల్వలు ఉన్నాయి. 2018-19 సంవత్సరామధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా వీటిని గుర్తించారు..వీటిలో 17 చోట్ల 7,897 మిలియన్ టన్నుల బొగ్గు,,లిగ్నైట్ ఉన్న గనులను సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం ఎక్కువగా వినియోగిస్తారు..ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది..ప్రస్తుతం భారతదేశం లిథియం,,నిఖిల్,,కోబాల్ట్ వంటి లోహాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది..జమ్మూకాశ్మీర్లో లిథియం నిల్వలు కనుగొనడంతో భవిష్యత్తులో విద్యుత్ వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనున్నది..దేశీయంగా వాహనాలు తక్కువ ధరలకు అందించేందుకు వెసులుబాటు కలుగుతుంది.. విద్యుత్ వాహనాలే కాకుండా స్మార్ట్ఫోన్లు తయారీలో కూడా లిథియం కీలకపాత్ర పోషిస్తుంది..దేశీయంగా తయారు చేస్తున్న ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *