అక్టోబర్ నుంచి 5G సేవలు ప్రారంభమయ్యే అవకాశం-అశ్విని వైష్ణవ్

అమరావతి: టెలికాం సంస్థలకు 5G స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ నెల 10వ తేది నాటికి పూర్తవుతుందని,, వచ్చే అక్టోబర్ నుంచి 5G సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందనికేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు..గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5G ఎక్విప్‌మెంట్ త్వరగా ఏర్పాటు చేసి, సేవలు ప్రారంభించాల్సిందిగా సంస్థలను కోరుతున్నట్లు చెప్పారు.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే,, మన దేశంలోనే టెలికాం సేవల ఛార్జీలు చాలా తక్కువని,, 5G సేవలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు..అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే మన దేశంలో టెలికాం సర్వీసుల ద్వారా వచ్చే రేడియేషన్ దాదాపు 10 రెట్లు తక్కువగా ఉందని,,దీని పట్టి చూస్తే, రేడియేషన్ తక్కువగా ఉందంటే మనం నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లే అని అన్నారు.. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత 5G ఫోన్ల అమ్మకాలు ఉపదుంకుంటాయన్నారు..మొబైల్ ఫోన్ల తయారీలో మనం రెండో స్థానంలో ఉన్నమని,, 25-30 శాతం వరకు 5G ఫోన్లు మన దేశంలోనే తయారు చేస్తున్నమన్నారు..