CRIMEDISTRICTS

చిత్తూరు,తిరుపతిలో విద్యార్దులకు డ్రగ్స్ విక్రయిస్తున్న 6 వ్యక్తులు ఆరెస్ట్

చిత్తూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే విశ్వనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆరుగురు సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….చిత్తూరు కేంద్రంగా పెద్ద డ్రగ్స్ మాఫీయ నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరుకు చెందిన సిరాజ్ కు బెంగళూరులో ఉంటున్న ఒమర్ పరిచయం అయ్యాడు.సుడాన్ నుంచి డ్రగ్స్ తెప్పించి బెంగళూరులో విక్రయించే ఒమర్ కు, సిరాజ్ పరిచయం కావడంతో ఒమర్ డ్రగ్స్ తీసుకుని చిత్తూరు వచ్చాడు. చిత్తూరులో మరో ఆరుగురుని వీరి ముఠాలో కలుపుకున్నారు. సుడాన్ నుంచి వచ్చే డ్రగ్స్ ను చిత్తూరు, తిరుపతి పరిధిలో ఉన్న అనేక ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.8 సభ్యుల ముఠాపై దాడులు నిర్వహించగా 6 మాత్రమే పట్టుపడ్డారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.2లక్షల విలువైన MDMA డ్రగ్స్ ను(34 గ్రాములు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, వెయింగ్ మిషన్, డ్రగ్స్ వాడేందుకు ఉపయోగించే సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సుడాన్ దేశస్తుడు అహ్మద్ ఒమర్ నుంచి పాస్ పోర్టు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, వీసా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వున్న వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *