అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.