ఒక్క లే ఔట్ లో 70 కోట్ల కుంభకోణం…
నెల్లూరు: రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లిపురం వద్ద శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్య స్వామి స్మార్ట్ సిటీ పేరుతో వేస్తున్న లేఔట్ ను శనివారం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తదితర టిడిపి నేతలతో కలిసి పరిశీలించారు..పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 23 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేశారని, అయితే ఈ స్థలంలో జాఫర్ సాహెబ్ కాలువ లేబరు కాలువ గుడిపల్లిపాడు కాలువ మరొక కాలువ మొత్తం నాలుగు కాలువలు ప్రవాహిస్తాయని,నాలుగు కాలువలకు, ఒక డ్రైన్ కు సంబంధించిన 4.5 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమించి లేఔట్ లో కలిపి రోడ్లు వేసేస్తున్నారని తెలిపారు..లేఔట్ లోకి రావడం కోసం ఇరిగేషన్ కాలువపై ఒక అనుమతిలేని బ్రిడ్జిని నిర్మించారని, పక్కనే వంద మీటర్ల దూరంలో మరో బ్రిడ్జి ఉందని, పక్కపక్కనే రెండు బ్రిడ్జి లకు అనుమతి ఇవ్వరని తెలిపారు.ఈ కాలువల కింద 40 నుంచి 50 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువలలో డీసెల్టింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా స్థలం లేకుండా చేసి స్మార్ట్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.వీళ్లకు ఉండే భూమి అంతా వీళ్ళు వేస్తున్న లేఅవుట్ ఎంత అని ప్రశ్నించారు. నుడా పరిమితులు లేకుండా పర్మిషన్లు లేకుండా ఎంతో అన్యాయంగా లే ఔట్ వేస్తున్నారని తెలిపారు..అంకణం ఒకటిన్నర లక్ష రూపాయలకు అమ్ముతున్నారని, పరిమితులు పాటించకుండా ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి 86 కోట్లకు అమ్మవలసిన స్థలాన్ని150 కోట్లకు అమ్ముతున్నారని కేవలం ఒక లేఅవుట్లో 70 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు..70 కోట్ల కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనీ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా ఇలాంటి కుంభ కారణాలు చేయడం కోసమేనా చుక్కల భూములను తొలగించింది అని ప్రశ్నించారు..నియమ నిబంధనలు పాటించకుండా లేఔట్ ను నిర్మిస్తున్నారని కలెక్టర్ కూడా ఇరిగేషన్ వారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అందరూ కుమ్మక్కైపోయారని విమర్శించారు..విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఐదు కోట్లు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయని, రెండు రోజుల నుంచి మా ఫోన్లు ఎత్తకపోతే నిజమేనేమో అనిపిస్తుందని అన్నారు.. ఇంటి ముందు మట్టి వేస్తేనే వారిని రాత్రి పగలు నిద్రపోనివ్వకుండా ఫైన్లు వసూలు చేస్తారని అలాంటిది 22 ఎకరాల్లో నాలుగున్నర ఎకరా ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమిస్తుంటే అధికారులకు తెలియడం లేదా అని మండిపడ్డారు..