అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధిష్టనంపై నమ్మకం సన్నగిల్లి పొతువుండడంతో,,కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మేల్యేలు,, సినియర్,జూనియర్ నాయకులు,బీజెపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు..ఈ నేపధ్యంలో, గోవాలో కాంగ్రెస్కు కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది..కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బుధవారం బీజేపీలో చేరిపోయారు..దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కమలం పార్టీలో చేరినవారిలో ఉన్నారు..ప్రధాని మోడీ, సీఎం ప్రమోద్ సావంత్ ల నాయకత్వంను బలోపేతం చేసేందుకే బీజేపీలో చేరామని మైఖేల్ లోబో తెలిపారు..గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది ఎమ్మేల్యేలు వుంటారు..వీరిలో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్కు 11 మంది ఎమ్మేల్యేలు ఉన్నారు.. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంటుంది.. గతంలోను కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే వార్తలు రావడంతో,అధిష్టానం జోక్యంతో అది సద్దుమణిగింది. దేశంను ఏకం చేస్తానంటూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకొవడం గమనార్హం.