అమరావతి: భారత్ లో 98 శాతం మందిలో కోవిడ్-19ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు.. చైనాలో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF-7 కారణంగా మరో సారి లాక్ డౌన్ విధిస్తారు అనే ఉహాగానలు చెలరేగుతున్న తరుణంలో భారతదేశంలో 98 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని,, అంత భయపడవల్సిన అవసరం లేదని ఐఐటీ కాన్పూర్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది..రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండేవారిపై మాత్రమే కొత్త వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉందని, అది కూడా చాలా స్వల్పంమేనని ప్రొఫెసర్ అన్నారు.