ఓటు హక్కును వినియోగించుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు

అమరావతిం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో తొలి తరం 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్ స్టేషన్ లో 105 ఏళ్ల వయసున్న నరోదేవి ఓటు వేశారు.80ఏళ్ల పైబడిన ఓటర్లకు తమ ఇళ్ల వద్దే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కానీ ఆ సదుపాయాన్ని నరోదేవి మాత్రం ఉపయోగించుకోలేదు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చింది….హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ ఉదయం నుంచి మొదలైంది.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.