బ్రిటీషర్లు వాలసవాద మనస్తత్వం ప్రదర్శించిన BBC డాక్యుమెంటరీ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు ప్రచారం..
అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై BBC ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో జాత్యహంకారం,,వలసవాద మనస్తత్వం ఆలోచనా ధోరణి వెల్లడి అయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు..గురువారం అయన మీడియాతో మాట్లాడారు..ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో జాత్యహంకారం,,వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని బాగ్చి అన్నారు..విశ్వసనీయత లేని కథనంతో విషబీజాలు ప్రజల్లో మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన,,తప్పుదారి పట్టించే,,పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు..పక్షపాతం నిష్పాక్షికత లేకపోవడం,, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా అయిన బ్రీటీషర్స్ మనస్తత్వం స్పష్టం చేస్తుందన్నారు..ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని,,ఇలాంటి డాక్యూమెంటరీ ప్రసారం చేయడంలో తెరవెనుక వున్న ఎజెండా ఏమిటని ప్రశ్నించారు..గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు..ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ,,జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని,,అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు.. గుజరాత్ లో ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని,, దానిపైన భారతదేశం ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు..బ్రిటీషర్, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని నిలదీశారు… ఎంక్వైరీ,,ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని,, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు..మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు.. ఎంక్వైరీ ఏమిటి ? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా ? ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశాన్ని వారు పాలిస్తున్నారా ? అని ప్రశ్నించారు..
(బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది..2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ,, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు చేసింది..దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది..కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు..భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు..ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.)