చైనా సైనికుల దురక్రమణకు ధీటుగా సమాధానం-రక్షణ శాఖ మంత్రి

అమరావతి: భారత్-చైనా సైనికుల మధ్య డిసెంబరు 9వ తేదిన చోటుచేసుకున్న ఉద్రికత్తలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారు.అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని,,వారి ప్రయత్నాలను మన సైనికులు తిప్పికొట్టారని తెలిపారు.ఈ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ చనిపోవడం కాని తీవ్రగాయాలూ కాలేదని వివరించారు. భారత సైనికులు ధైర్య, సాహసాలను ప్రదర్శించారని, వారిని అభినందించాల్సిందేనని అన్నారు. చైనా కుతంత్రానికి మన సైనికులు దీటుగా సమాధానం ఇచ్చారని చెప్పారు. సరైన సమయానికి భారత మిలటరీ కమాండర్లకు జోక్యం చేసుకుని, చైనాతో చర్చలు జరపడంతో చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు.