CRIMENATIONAL

యూజర్లను మోసం చేసిన గేమింగ్ యాప్-ఈడీ దాడుల్లో బయటపడిన రూ.7 కోట్లు

అమరావతి: ప్రజలను మోసం చేసిన మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్​కతాలోని ఆ యాప్​ ప్రమోటర్​కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాడులు నిర్వహించి రూ.7 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది..ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ-నగ్గెట్స్ యాప్​ ప్రారంభించిన కొత్తలో యూజర్లకు కమీషన్లు ఇచ్చారు..వ్యాలెట్​లోని బ్యాలెన్స్​ను ఈజీగా విత్​డ్రా చేసుకునే వీలు కల్పించడంతో,,యూజర్లలో యాప్​పై నమ్మకం పెరిగింది..ఎక్కువ కమీషన్​కు ఆశపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు..ఇలా భారీ మొత్తంలో నిధులు సమీకరించిన తరువాత యాప్​ నుంచి యూజర్లు కమీషన్​ విత్​డ్రా చేసుకునే ప్రక్రియను ఈ-నగ్గెట్స్ యాజమాన్యం నిలిపివేసింది.. సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామని, దర్యాప్తు సంస్థలు విచారణను ఎదుర్కొంటున్నామని కుంటు సాకులు విన్పిస్తూ, చివరకు యూజర్ల డేటా సహా సర్వర్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది..దింతో ఈ యాప్ చేసిన ఘరాన మోసం యూజర్లకు అర్థం కావడంతో,ఈ-నగ్గెట్స్​ యాప్​ సహా ఆ కంపెనీ ప్రమోటర్​పై 2021 ఫిబ్రవరిలో కోల్​కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *