స్వాతంత్య్ర దినోత్సవంకు ముందు భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన సైన్యం

అమరావతి: భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న సమయంలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన దాదాపు 25 నుంచి 30 కిలోల IEDని సైన్యం నిర్వీర్యం చేసింది.. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగామని కశ్మీ ర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు..రెండు రోజుల ముందు ISISతో సంబంధాలు ఉన్న ఓ ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది.. సబౌద్దిన్ అనే నిందితుడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐఈడీలు పేల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు..నిందితుపై లక్నోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..