AMARAVATHINATIONAL

హిందుదేవాలయంలో ముస్లిం మతచారం ప్రకారం పెళ్లి చేసుకున్నముస్లిం జంట

అమరావతి: భారతదేశంపై విషం చిమ్మే కొన్ని ఉగ్రసంస్థలు,ముస్లింలకు ఏదో ఆన్యాయం జరిగిపోతుందంటూ,యువతను రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు..అలాంటి వారికి సమాధానం ఇచ్చేలా ఒక సంఘటన హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది..

గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది..పెళ్లి కూతురు M.Tech gold medal,, పెళ్లి కొడుకు civil engineer..వీరిది  పేద కుటుంబం కావటంతో పెళ్లి వేడుకకు ఇబ్బంది పడుతున్నారు..అదే గ్రామంలోని సత్యనారాయణ స్వామి ఆలయం,అందులో విశ్వహిందూ పరిషత్ ( VHP), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయాలు కూడా పనిచేస్తున్నాయి..వీరి ఇబ్బందిని గమనించిన VHP, RSS ప్రతినిధులు,,గ్రామంలోని సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని నిర్ణయించారు.. 

సనాతన హిందూ ధర్మ అందరినీ కలుపుకుని వెళ్లాలని స్పష్టం చేస్తుందని,,మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతుందని,అందుకే ముస్లిం జంట పెళ్లి సత్యనారాయణ స్వామి ఆలయంలో, ముస్లిం మత ఆచారం ప్రకారం నిర్వహించటానికి అనుమతించినట్లు దేవాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ తెలిపారు.. హిందూ సంస్థలు ముస్లింలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు..ఇక్కడ ఓ ముస్లిం జంట పెళ్లి గుడిలో జరిగిందని,,మనుషుల మధ్య రాజకీయం ఉండకూడదన్నారు..గుడిలోని ముస్లిం జంట పెళ్లికి రాంపూర్ గ్రామస్తులతో పాటు హిందూ పరిషత్,ఆర్.ఎస్,ఎస్ ప్రతినిధులు అందరూ హాజరయ్యారు.. 

ఈ పెళ్లి గురించి వధువు తండ్రి మాలిక్ మాట్లాడుతూ, నా కుటుంబానికి, నా కుమార్తె వివాహానికి విశ్వహిందూ పరిషత్,, ఆలయ ట్రస్ట్,, స్థానికులు ఎంతో అండగా నిలిచారని, దగ్గర వుండి పెళ్లిని జరిపించడం ఎంతో ఆనందగా వుందన్నారు.. హిందూ దేవుడి ఆలయంలో, ముస్లిం మత ఆచారం ప్రకారం ఓ పెళ్లి జరగటం..గ్రామస్థులు మాట్లాడుతూ దేశంలోని మనుషులందరూ ఒక్కటే అని చాటిచెప్పిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *