భారత సైబర్ వ్యవస్థలో కొత్త మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ సోవా వేగంగా విస్తరిస్తోంది-CERT

అమరావతి: కొత్త మొబైల్ బ్యాంకింగ్ ‘ట్రోజన్’ వైరస్-సోవా,,ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా ఎన్‌క్రిప్ట్ చేస్తుంది..ఒక సారి ఇది install అయితే uninstall చేయడం కష్టం..ఈ వైరస్ భారతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోందని ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (The Indian Computer Emergency Response Team- CERT) తన తాజా బులెటన్ లో హెచ్చరించింది..మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల యూజర్‌నేమ్, పాస్‌వర్ట్, కుకీస్స్ ను దొంగిలించగలిగే, ఈ వైరస్ 1st versionను ఈ సంవత్సరం జూలైలో గుర్తించగా ప్రస్తుతం 5th version విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు..గతంలో అమెరికా, రష్యా, స్పెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్న సోవా వైరస్,,2022 జూలైలో భారత్‌లోకి ప్రవేశించిందని, మరిన్ని దేశాల్లోనూ విస్తరిస్తోందని CERT వెల్లడించింది.క్రోమ్, అమెజాన్ వంటి ప్రముఖ యాప్‌ల లోగోలతో దర్శనమిచ్చే నకిలీ ఆండ్రాయిడ్ అప్లికేషన్లలో దాగి మీ మొబైల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది..అలాంటి నకిలీ యాప్‌లను కనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే వైరస్ కూడా మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది..వివిధ బ్యాంకులకు చెందిన మొబైల్ యాప్‌లు, క్రిప్టో వ్యాలెట్లు సహా 200కు పైగా మొబైల్ యాప్‌లను సోవా వైరస్ టార్గెట్ చేయగలదని CERT తన అడ్వైజరీ నోట్‌లో పేర్కొంది..