అమరావతి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..సాయిబాబా భక్తులతో షిర్డీ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,,ట్రక్కు ఢీ కొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు..నాసిక్-షిర్డీ హైవేపై పాఠారేకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు..ప్రమాదం ధాటికి బస్సు బోల్తా పడడంతో బస్సు ముందు భాగం, అద్దాల ధ్వంసమయ్యాయి..బస్సులో చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు..మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు,మరో వ్యక్తి ఉన్నారు..మరో 17 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి..ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తోంది..వారిని సిన్నార్ రూరల్ ఆసుపత్రి,,యశ్వంత్ ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నారు..ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే,,మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకంటించారు..గాయపడిన వారి చికిత్స అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.