హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలంటూ నిరసన దీక్ష

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు.మంగళవారం గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అంతకుముందు ఉత్సవ సమితి చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకుని భగవంతరావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వారు ఉత్సవ సమితి కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు.ఈ నెల 9వ తేదీన హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహల నిమజ్జనం చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని,,లేకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.
వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదు- సీపీ సీవీ ఆనంద్
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు.హైకోర్టు ఆదేశాలను ప్రకారం పిఓపి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదన్నారు..కేవలం మట్టి వినాయకులను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు.