సైన్యంకు ఆత్మనిర్భర భారత్ తో అధునిక ఆయుధాలు-ప్రధాని మోదీ

సైనిక కుటుంబ సభ్యులంతా..
అమరావతి: పాలన చేపట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,,తన సాంప్రదాయాన్ని నేడు కూడా కొనసాగించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి జరుపుకునేందుకు ప్రధాని మోదీ కార్గిల్ చేరుకున్నారు. కార్గిల్‌లోని సైనికులతో కలిసి ప్రధాని దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి దైవభక్తితో సమానమని తెలిపారు. సైనికుల వల్లే దేశంలో శాంతి, భద్రతలు నెలకొన్నాయని,,తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారని జవాన్లపై ప్రశంసలు ప్రధాని మోదీ కురిపించారు.సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని, ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు అని ప్రధానమంత్రి అభివర్ణించారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పారు. సైనిక కుటుంబ సభ్యులంతా తన కుటుంబ సభ్యులేనని, వారి పిల్లల కోసం అనేక సైనిక స్కూల్స్ ప్రారంభించామని చెప్పారు. భారత్ దగ్గర ఉన్న స్వదేశీ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి అని,, భారతదేశం ఎప్పుడూ యుద్ధం అనేది చివరి ప్రయత్నంగా చూస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.అనంతరం జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వీట్లు పంచారు.
A spirited Diwali in Kargil! pic.twitter.com/qtIGesk98x
— Narendra Modi (@narendramodi) October 24, 2022