అమరావతి: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఉదయం శివనేత నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతున్న సమయంలో గుంపులోకి వచ్చిన ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు సమాచారం.ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఎ.30 పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి కాల్పులు జరుపుతున్న సంఘటన సి.సి కెమెరాలో రికార్డు అయింది.కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు.కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలినట్టు శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ ఆరోపించారు.