AMARAVATHIDISTRICTS

కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కమిటీ సభ్యుల బృందం

నెల్లూరు: ఎన్నికల సంఘం సూచనల మేరకు, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో చివరి ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు /117 – నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, జిల్లా కౌంటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తో కలిసి రిటర్నింగ్ అధికారి కమిటీ సభ్యులంతా గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్.ఓ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాళ్లలో చైర్లు, టేబుళ్ల ఏర్పాటు, ఇంటర్నెట్, కేబుల్స్, లాప్ టాప్స్, ప్రింటర్లు, స్కానర్లు, సిసి కెమెరాలు వంటి సాంకేతిక పరికరాలు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు, తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రాంగణంలో తాగునీటి వసతి, పారిశుధ్య నిర్వహణ, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్.ఓ ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *