x
Close
DISTRICTS

ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి-కలెక్టర్

ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి-కలెక్టర్
  • PublishedJuly 21, 2022

హర్‌ ఘర్‌ తిరంగా…

నెల్లూరు: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా…ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని…ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుండి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకూ నిర్వహించనున్న పలు కార్యక్రమాలు,’హర్ ఘర్ తిరంగా’పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు జిల్లాల్లో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో భాగంగా హోర్డింగ్స్, గీతాలు, పోస్టర్లు, సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాల ప్రదర్శన, ర్యాలీలు, సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు, ఇతర సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు.. అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్య పరచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఇళ్ల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించాలన్నారు. రేషన్‌ దుకాణాలు, గ్రామ, వార్డు సచివాలయలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు కూడా వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ జెండాల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,  వలంటీర్లును భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి ఇంటికి, ప్రతి సముదాయానికి జాతీయ పతాకాలను పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఇంటిపై, సముదాయంపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం అవుతుందని సూచించారు. అన్ని శాఖలు, విభాగాలు ఫ్లాగ్‌ కోడ్‌ను పాటించాలని సూచించారు. మువ్వెన్నల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఆగస్టు 13వ తేదీన నేషనల్ ఫ్లాగ్ తో సెల్ఫీ ఫోటో దిగాలన్నారు.14వ తేదీన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం కార్యక్రమం నిర్వహించాలన్నారు. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.