AMARAVATHITECHNOLOGY

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

అమరావతి: ప్రతి రోజు నూతన అవిష్కరణలతో టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గణనీయమై మార్పులు చోటుచేసుకుంటున్నాయి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫేక్ వీడియో గురించి మాట్లాడుతుండగా,, ఆ వీడియో పై భాగంలోనే మరో వీడియోలో అచ్చం అదే వ్యక్తి స్టైల్ లో సెలబ్రెటీలు మాట్లాడుతున్నట్టుగా తల భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి చిత్రీకరించారు.. ఈ విషయాన్ని కింద వీడియోలో ఉన్న వ్యక్తి తెలియచేస్తే, తప్ప గుర్తించలేని పరిస్థితి కన్పిస్తుంది..మొదటి సారి చూసిన వాళ్లెవరైనా అదే నిజమైన వీడియో అని నమ్మే పరిస్థితి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా,, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి హెచ్చరిస్తూ,,ఈ వీడియో మనకు ఒక మేలుకొలుపు వంటిదని చెప్పారు.. ఇలాంటి మోసపూరిత వీడియోల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మనం ఏ మేరకు సన్నద్ధమవుతున్నామనేది ఆలోచించాలని కోరారు..ఇలాంటివి చూడడానికి వినోదభరితంగా ఉండొచ్చేమో కానీ… అవే అత్యంత దారుణమైనవన్నారు.. అవే ప్రజల మధ్య వివిధ పరిస్థితులను సృష్టించి,,విధ్వసం కలిగిస్తే, మీరు  ఏంచేస్తాం ? అని ప్రశ్నించారు.. ఇటువంటి శక్తిమంతమైన వ్యవస్థలతో రూపొందించిన ఫేక్ కంటెంట్ నుంచి రక్షణ కోసం తనిఖీ వ్యవస్థలు ఉండాలి కదా ? అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు..(వీడియోను ఒకటికి రెండు సార్లు చూడండి.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *