ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు రూ.10 కోట్లు చెల్లించా-సుఖేష్ చంద్రశేఖర్

అమరావతి: ఆర్థిక నేరారోపణలపై జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్,ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో వున్న తనకు రక్షణ కల్పిస్తానని చెప్పడంతో,తాను సత్యేంద్ర జైన్ కు ప్రొటక్షన్ మనీగా రూ.10 కోట్లు చెల్లించానని సుఖేష్ చంద్రశేఖర్ ఫిర్యాదుతో కూడిన లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు పంపారు. హైకోర్టులో దాఖలు తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ప్రిజన్ అండ్ జైల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ ద్వారా తనను జైన్ బెదరించినట్టు ఆ లేఖలో చంద్రశేఖర్ ఆరోపించారు.”2017 నుంచి నేను జైలులో ఉన్నాను…2015 నుంచి నాకు సత్యేంద్ర జైన్ తో పరిచయం వుంది..ఆ సమయంలో జైల్లో తనను కలసిన జైన్,,సౌత్ జోన్‌లో కీలకమైన పదవితో పాటు రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సహకరిస్తామని చెప్పడంతో రూ.50 కోట్లు ఆప్‌కు కంట్రిబ్యూట్ చేశాను” అని చంద్రశేఖర్ స్వదస్తూరీతో రాసిన లేఖలో చెప్పారు. తన లాయర్ అశోక్ సింగ్ ద్వారా ఆ లేఖను పోస్ట్ చేయించినట్టు ఆయన తెలిపారు. చంద్రశేఖర్ తాజా ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మొదలుపెట్టింది.