అమరావతి: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్ అభ్యర్ధులు మెజారిటీ సాధించారు. ఆప్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. గత 15 ఏళ్లుగా MCDలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆప్ గట్టి షాకిచ్చింది..9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.250 వార్డుల్లో:- ఆప్–134…బీజేపీ–104…కాంగ్రెస్–9…ఇండిపెండెంట్ అభ్యర్థులు–3.