నెల్లూరు: గత కొన్ని సంవత్సరాలుగా పౌరసరఫరాలశాఖ జరుగుతున్న కుంభకోణాలపై రాష్ట్రస్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించడంతో,బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ స్కామ్ కు మూలకారణంగా భావిస్తున్న? D.M పద్మాను విధుల్లో నుంచి సస్పెండ్ చేసి,జ్యూడిషియల్ కస్టడిలో తీసుకుని విచారిస్తున్నారు.ఈ స్కామ్ లో D.M పద్మా వద్ద పని చేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్ శివకుమార్, ఇంటిలో ఏసీబీ DSP మోహన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.అలాగే మినీ బైపాస్ రోడ్డు, ఆన్నమయ్య సర్కిల్, శ్రీనగర్ కాలనీలో పద్మా నివాసం ఉంటూన్న ఇంటిలో సోదాలు నిర్వహించారు.కొన్ని ఆస్తులకు సంబంధించి పత్రాలు,బంగారం,కొంత నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి వుంది.
(పౌరసరఫరాలశాఖలో దాదాపు రూ.40 కోట్ల మేర కుంభకోణం జరిగిందని,ఈస్కామ్ పై ఉన్నతధికారుల ఆదేశాలతో సమగ్రమైన దర్యాప్తు కోసం సంబంధిత శాఖలను కోరడం జరిగిందని జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ ఈనెల 3వ తేదిన మీడియా సమావేశంలో వెల్లండించారు.)