తిరుపతి: సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించింది..కార్యాలయంలో 10 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా,,లెక్కల్లో చూపని రూ.1.93 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి..టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఫైళ్లు పరిశీలించారు..భవన నిర్మాణ అనుమతులపై టౌన్ ప్లానింగ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం..కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసిన కొద్ది నిమిషాల్లోనే కమిషనర్ చాంబర్ సమీపంలోని కిటికీలోనుంచి నోట్ల కట్ల కిటికీల్లోంచి కమిషనర్ విసిరి పారేసినట్లు స్థానికులు తెలిపారు..డబ్బులు డబ్బులు కట్టను స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు,,కార్యాలయంలో నిలిపి వుంచిన కారులో తనిఖీలు చేయగా,,కమిషనర్ కారులో మరో రూ.50 వేలు నగదు లభ్యంమైనట్లు తెలుస్తుంది..