నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలో అదివారం మధ్యహ్నం తెలుగు గంగ ఆఫీసర్స్ కాలనీ ప్రాంతంలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగి గొడవ కేసులో ముద్దాయి SK.రఫీ(36) అరెస్ట్ చేయడం జరిగిందని ఎఎస్పీ హిమవతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు. నిందితుడు తప్పు చేసి పారిపోవడం,ఫోన్ లు మార్చడం కూడా చేసినా నిందితుడిని,సాంకేతిక,,సమాచార వ్యవస్థ ద్వారా తక్కువ సమయంలోనే అరెస్టు చేసినట్టు ASP తెలియచేసారు…ఈ కేసు చేధించడంలో ప్రతిభ కనబరిచిన నెల్లూరు ఐదో పట్టణ CI నరసింహారావు,,కానిస్టేబుల్స్ సుబ్బారావు, విజయమోహన్, శ్రీనివాసులు తదితరులను,ASP అభినందించారు…