గుంటూరులో జరిగిన సంఘటన మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలి-పవన్ కల్యాణ్

అమరావతి: చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని,,ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందించారు..ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని,,అదే సమయంలో పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు..కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు..ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు..కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని,,ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు..హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని,,ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్ కోరారు.