పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్దం-నటుడు అలీ

అమరావతి: పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని సినీ నటుడు,,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు..పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి తాను రెడీగా వున్నాని అన్నారు.. సినిమాలు వేరు,,రాజకీయాలు వేరన్నారు..పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే అయినా, పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే నేను సిద్ధమన్నారు..2024 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు..మంత్రి రోజా ఫైర్ బ్రాండ్,,ఆమె ఎక్కడా తగ్గదన్నారు.. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమే అని,,రోజాను డైమండ్ రాణీతో పోల్చడమంటే విలువైనదిగా గుర్తించడమే అని అన్నారు.