నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఆదాల.ప్రభాకర్ రెడ్డి

అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని,,వైసీపీ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించిన,,అధిష్టానం ఆ స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమించింది..నెల్లూరు జిల్లా వ్యవహారంపై వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు…వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంనుం ఆదాల.ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల.రామకృష్ణరెడ్డి తెలిపారు..ఫోన్ టాపింగ్ అంశాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.కోటంరెడ్డి.శ్రీనివాసులురెడ్డి ప్రదర్శించిన ఆడియో క్లిప్పింగ్,,ఎమ్మెల్యే ఫోన్ కాల్ ను ఆయన స్నేహితుడే రికార్డ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఎమ్మెల్యేలు ఆనం,,శ్రీధర్ రెడ్డిలు నిరూపించాలని సవాల్ చేశారు. ఎమ్మేల్యేపై చర్యలకు సంబంధించి త్వరలో పార్టీలో చర్చించి తీసుకుంటామన్నారు.