DISTRICTS

ఆదాల, మీరే ఇరుకళల అమ్మవారి జాతరను జరిపించండి-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: ఈ నెల 25వ తేదిన రూరల్ నియోజకవర్గంలో పరిధిలోని రోడ్లు, కాలువలు, కల్వర్టులు, సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయంలో నిరసన ధర్నాచేపడుతున్నట్లు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ అధికారపక్షం అయినా ప్రతిపక్షం అయినా ప్రజాపక్షాన నిలబడుతానని, అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ విషయంపై పదే పదే అధికారుల చుట్టూ తిరిగినప్పటికి పరిష్కారం కాలేదని చెప్పారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం పనులు జరిగాయి, కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదని తెలిపారు. కాంట్రాక్టర్ కి బిల్లులు ఇచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి సన్న, చిన్నకారు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తానని,, అవసరం అయితే న్యాయపోరాటం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.. ఇరుకళల అమ్మవారి జాతరను నేను, నా స్నేహితుల సహకారంతో మార్చి 26, 27, 28న జాతర నిర్వహిస్తాం అని నేను వైసీపీలో ఉండగానే ప్రకటించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నేను వైసీపీ నుంచి బయటకి వచ్చాక జాతర కోసం దేవాదాయశాఖకి అనుమతుల కోసం లేఖ రాస్తే, ఎన్నికల కోడ్ ఉందని,,అనుమతి ఇవ్వమని దేవాదాయశాఖ కమిషనర్ ఫోన్ లో చెప్పారని తెలిపారు..ఈ నెల 25లోపు అనుమతి ఇస్తే, 26న మూగ చాటింపు వేయించాల్సి ఉందన్నారు..రాజకీయాలకు, ఎన్నికలకు, దైవ కార్యక్రమానికి ముడిపెట్టడం ఏమిటని మండిపడ్డారు. ప్రస్తున వైసీపీ రూరల్ ఇంచార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మీరే అనుమతి తెచ్చుకుని, మీరే గ్రామ జాతరను జరిపించండి.నేను సాధారణ భక్తుడిగా జాతరలో పాల్గొంటాను అని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *