విజ్ఞానగిరిపై ఆడికృతిక మహోత్సవం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృతిక మహోత్సవం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమై విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీసారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నారద పుష్కరిణిలో భక్తులు తలనీలాలు సమర్పించి కోనేటి నీటిలో పుణ్య స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. ధర్మకర్తలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈఓ సాగర్ బాబులు కొండపై ఏర్పాట్లను పరిశీలించారు.డీఏస్పీ విశ్వనాధ్ ఆధ్వర్యంలో అర్బన్ సిఐ అంజూయాదవ్,పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.