AMARAVATHI

పాకిస్తాన్ నుంచి వచ్చే రవాణ ట్రక్కులను నిలిపివేసిన ఆఫ్గనిస్థాన్

అమరావతి: పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ ల మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి..గత మూడు రోజుల నుంచి పాకిస్థాన్ నుంచి వస్తున్న వేలాది ట్రక్కులు ఆఫ్గనిస్థాన్ లో ప్రవేశించకుండా టోర్కామ్ సరిహద్దు వద్ద నిలిపివేసింది..ఆఫ్గనిస్థాన్ పౌరులను పాకిస్తాన్ బహిష్కరించిన నేపధ్యంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది.. ఆఫ్గనిస్థాన్ అవలంభించిన ఈ కఠిన వైఖరితో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది..
ఈ బహిరంగ సరిహద్దు ద్వారానే పాకిస్థాన్,, భారత్ లోకి పెద్దఎత్తున డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేదని మన విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు..పాకిస్థాన్ నుంచి ఆఫ్గనిస్థాన్ కు పంపిన ట్రక్కుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తిరిగి పాకిస్థాన్ కు చేరుకుంటాయని విదేశీ వ్యవహారాల వెల్లడిస్తున్నారు.. ఆఫ్గనిస్థాన్,వాణ్యిజ,వ్యాపార సంబంధలు దాదాపు తెగిపోవడంతో రాబోయే రోజుల్లో పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ వ్యాపారం అరికట్టవచ్చని అంచనా వేస్తున్నారు..
పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది..ఒక లెక్క ప్రకారం, ఇప్పటివరకు 3,5 లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు పంపించి వేశారు..వీరిలో వేలాది మంది గనిస్థాన్ నుంచి చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లడమే కాకుండా శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారని పాకిస్థాన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్గనిస్థాన్ లోపల పరిస్థితిని మరింత దిగజారిన సందర్భంలో పాకిస్థాన్ కుట్రలు ప్రారంభించింది.
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు ప్రస్తుతం ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి.. గత కొన్ని రోజుల నుంచి ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే వారిపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది..చట్టబద్ధమైన వీసా, పాస్ పోర్ట్ హోల్డర్లు మాత్రమే వచ్చేలా,, మిగతా వారిని ప్రవేశించకుండా నిషేధించడం ప్రారంభించిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది..ఈ విషయపై పాకిస్థాన్ కు ఆఫ్గనిస్తాన్ నిరసన వ్యక్తం చేసింది..అయితే ఇందుకు పాకిస్తాన్,, వాణిజ్యాన్ని మూసివేస్తామని ఆఫ్గనిస్తాన్ ను బెదిరించడం ప్రారంభించింది..ఇందుకు ప్రతీకారంగా మంగళవారం సాయంత్రం నుంచి వేలాది పాకిస్థానీ ట్రక్కులను దేశంలోకి రాకుండా ఆఫ్గన్ ఆపడమే కాకుండా, పాక్ లో ఉన్న తమ ట్రక్కులన్నింటినీ వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది..రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సందే..

 

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

8 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

8 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

15 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.