నెల్లూరు: చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న 300 కే.జిల కుళ్లిన చికెన్,లివర్ మళ్లీ నెల్లూరులో పట్టుబడింది.శనివారం కార్పొరేషన్,హెల్త్ అధికారులకు అందిన విశ్వనీయ సమాచారంతో 6 లెన్ హైవేపై నిఘాపెట్టిన అధికారులు,ఐస్ క్రీమ్ వ్యాన్ లో కుళ్లిపోయిన చికెన్,చికెన్ లివర్ ను కేజి రూ.40లకు నెల్లూరలోని ఆరిఫ్ అనే వ్యక్తి చెన్నై నుంచి సరఫరా జరుగుతున్న సమయంలో సీజ్ చేశారు.కుళ్లిన చికెన్,చికెన్ లివర్ రెస్టారెంట్స్ సరఫరా అవుతుంది..ఎన్నో సార్లు అధికారులు ఇలా రెస్టారెంట్స్ పై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి.నగరంలో కొన్ని రెస్టారెంట్స్ ఇలా కుళ్లిపోయిన చికెన్ ను ఫ్రీజర్ లో పెట్టి, కస్టమర్స్ అర్డర్ ఇచ్చినప్పుడు ఈ కుళ్లిన చికెన్,లివర్ ను వేడి వేడిగా వడ్డించి,వేల రూపాయలు దండుకుంటారు.రేపు ఆదివారం కావడంతో భోజన ప్రియులు జాగ్రత్తగా వుండకపోతే,మీ ఆరోగ్యం చేజారిపోతుంది తస్మాత్ జాగ్రత్త?