కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్దుల వయస్సు రెండేళ్ల పొడిగింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు రెండేళ్ల పాటు వయస్సు పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీసు నియమకాలకు డిసెంబర్ 28, జనవరి 18 తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి.కానిస్టేబుల్ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్దులకు రెండేళ్ల వయోపరిమితిన పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..కానిస్టేబుల్ పోస్టుల్లో 3.580 సివిల్,,2520 ఏపీఎస్‌పీ పోస్టులు వున్నాయి.