DISTRICTS

అగ్నిపధ్ రిక్రూట్మెంట్ ర్యాలీ సెప్టెంబర్ 15 నుంచి-కలెక్టర్

నెల్లూరు: ఆర్మీ సర్వీస్ లో చేరే యువకుల కోసం వచ్చే ఆగస్టు నెల9వ తేదీ నుంచి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కమిటీ సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా కలెక్టర్, ఆర్మీలో చేరే సువర్ణ అవకాశం అంటూ DRDA ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రాలను, కరపత్రాలను ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మీ సర్వీసులో చేరే యువకుల కోసం నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్నిపధ్ పథకంలో భాగంగా గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఆధ్వర్యంలో వచ్చే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబడుతుందన్నారు..ఇందుకోసం అర్హులైన యువకులు వచ్చే ఆగస్టు 3వ తేదీలోగా వారి పేర్లను www.joininindianarmy.nic.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.ఈ విషయమై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.జిల్లా నుంచి వీలైనంత ఎక్కువమంది యువకులు ఆర్మీకి ఎంపిక అయ్యేందుకు వీలుగా వారికి వచ్చే నెల 9వ తేదీ నుండి తగినంత శిక్షణ ఇచ్చి సుశిక్షితులుగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ ఎస్టీలు తదితర దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు ఎంపిక అయ్యేలా కృషి చేయాలన్నారు..ఈ సమావేశంలో సెట్నేల్ CEO డి పుల్లయ్య, ARASP శ్రీనివాసరావు,DRDA PD సాంబశివరెడ్డి,DPO శ్రీమతి ధనలక్ష్మి,DM&HO Dr.పెంచలయ్య, చీఫ్ కోచ్ యతిరాజు,DSA పర్యవేక్షకులు విజయ్ కుమార్,కమిటీ సభ్యులు సెపక్ తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి ఉమా, బీచ్ కబడ్డీ క్రీడాకారుడు సురేష్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, డీకే డబ్ల్యూ కళాశాల వ్యాయామ విద్య ఉపన్యాసకులు శ్రీమతి విజయ కళ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *